Saturday, April 20, 2024

తెలంగాణ‌కు ఎల్లో అలర్ట్ .. 15వరకు రాష్ట్రంలో మోస్త‌రు నుంచి భారీ వర్షాలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఈ నెల 15 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ ను జారీ చేసపింది. మంగళవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాగా… సోమవారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసీఫాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిశాయి. పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement