Thursday, April 25, 2024

Smart Tech: ఫిట్‌బిట్ స్మార్ట్​ వాచ్​ లాంచ్​.. ప్రారంభ ధర రూ. 8,999

భారతీయ మార్కెట్‌లోకి ఫిట్‌బిట్‌ తన ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ వాచీలను లాంచ్‌చేసింది. ప్రారంభ ధరను రూ. 8,999గా నిర్ధారించింది. స్మార్ట్‌ వాచ్‌ డిజైన్‌లో పెద్దగా మార్పులు చేయనప్పటికీ, కొత్త ఫీచర్లను జోడించి సరికొత్త స్మార్‌ ్ట వాచ్‌లను విడుదల చేసింది. గూగుల్‌ కంపెనీ ఫిట్‌బిట్‌ వెర్సా 4, ఫిటిబిట్‌ సెన్స్‌ 2, ఇన్‌స్పైర్‌ 3 పేరుతో కొత్త స్మార్ట్‌ వాచ్‌లను లాంఛ్‌చేసింది. ఫిట్‌బిట్‌ ఇన్‌స్పైర్‌ 3 బ్రాండ్‌ నుంచి అందుబాటులో ధరలో కస్టమర్ల ముందుకు వచ్చింది.

హార్ట్​రేట్‌ ట్రాకింగ్‌ సహా పలు హెల్త్‌ ఫీచర్లు ఈ కొత్త వాచ్‌లో ఉన్నాయి. సెస్స్‌ 2 అనేది న్యూ ఈడీఏ సెన్సర్‌తో రోజంతా మనిషి ఒత్తిడి లెవెల్‌ ్సను రీడ్‌ చేస్తుంది. ఇందులో 40 ఎక్సర్‌సైజ్‌ మోడ్‌లు, జీపీఎస్‌ వెసులుబాటు ఉంది. హార్ట్​రేట్‌, స్కిన్‌ టెంపరేచర్‌ మెజర్‌మెంట్‌, న్యూ బాడీ రెస్పాన్స్​ సెన్సర్‌ వంటి ఆధునిక ఫీచర్లున్నాయి. ఫిట్‌బిట్ సెన్స్​ 2, వెర్సా ధర రూ. 20,499 గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement