Saturday, May 4, 2024

ODI World Cup | ఆసీస్​కు తొలి విజయం.. 36 ఓవర్లలోనే ముగించేశారు!

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా ఇవ్వాల ల‌క్నో వేదిక‌గా ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య జ‌రిగిన మ్యాచ్ లో.. ఆస్ట్రేలియా జ‌ట్టు ఎట్ట‌కేలకు తొలి విజ‌యాన్ని త‌మ ఖాతాలో వేసుకుంది. శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 210 పరుగులతో ఛేజింగ్​కు దిగిన ఆస్ట్రేలియా జ‌ట్టు 35 ఓవ‌ర్ల‌లోనే విజ‌య లక్షాన్ని చేరుకుంది.

ఇక.. ఆస్ట్రేలియా బ్యాట‌ర్ల‌లో మిచెల్ మార్ష్ (52), జోష్ ఇంగ్లిస్ (58) ప‌రుగుల‌తో హాఫ్ సెంచ‌రీ చేయ‌గా.. మార్నస్ లబుషేన్​ (40), గ్లెన్ మాక్స్‌వెల్ 31, మార్కస్ స్టోయినిస్ 20 ప‌రుగుల‌తో పర్వాలేదనిపించారు. ఇక శ్రీలంక బౌల‌ర్ల‌లో దిల్షాన్ మధుశంక 3 వికెట్లు తీయగా.. దునిత్ వెల్లలాగే ఒక్క వికెట్ ద‌క్కించుకున్నాడు.

కాగా, ఈ మ్యాచ్ లో మొద‌ట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక 43.3 ఓవర్లలో 209 పరుగులు చేసి ఆలౌటైంది. శ్రీలంక బ్యాట‌ర్ల‌లో పతుమ్ నిస్సంక (61), కుశాల్ పెరీరా (78) మినహా మిగిలిన వారు అంతగా రాణించలేకపోయారు. ఇక‌, ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా 4 వికెట్లతో మెరిశాడు. ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ లకు చెరో రెండు వికెట్లు లభించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement