Friday, May 17, 2024

Tragedy in Adoni – నీటి టబ్బులో పడి 11 నెలలచిన్నారి మృతి

ఆదోని,టౌన్ ప్రభ న్యూస్: ఆదోని పట్టణం రాజీవ్ గాంధీ నగర్లో సోమవారం విషాదం చోటుచేసుకుంది. నీటి టబ్బులో 11 నెలల చిన్నారి హర్షవర్ధన్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తల్లి బూషమ్మ వివరాల ప్రకారం.. ఇంట్లో ఆడుకుంటూ బాలుడు ప్రమాదవశాత్తు నీటి టబ్బులో పడ్డాడు. చికిత్స నిమిత్తం అతడిని ఆదోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement