Thursday, May 9, 2024

ఏజెంట్ నుంచి ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్.. వీడియోతో

అఖిల్‌ అక్కినేని, సురేందర్‌ రెడ్డిల చిత్రం ‘ఏజెంట్‌’. ఏప్రిల్‌ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. హిప్‌ హాప్‌ తమిళ సంగీతం అందించారు. చిత్ర బృందం మొదటి సింగిల్‌ ” మళ్ళీ మళ్ళీ… ” పాటని అక్కినేని ఫ్యాన్స్‌ ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశారు. పాటను యూనిక్‌ స్టయిల్‌ లో లాంచ్‌ చేశారు. అఖిల్‌ ఈ పాటలో చాలా స్టైలిష్‌గా కనిపించారు. నాయిక సాక్షి వైద్య అందంగా కనిపించింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కట్టిపడేస్తుంది. అందమైన విదేశీ లొకేషన్స్‌లో రూపొందించిన పాటలోని విజువల్స్‌ కళ్లు చెదిరేలా ఉన్నాయి. సురేందర్‌ రెడ్డి మునుపెన్నడూ చూడని అవతార్‌, క్యారెక్టర్‌లో అఖిల్‌ని చూపిస్తున్నారు. మరో ముఖ్యపాత్రలో మమ్ముట్టి నటిస్తున్నారు. రసూల్‌ ఎల్లోర్‌ కెమెరా వర్క్‌ అందిస్తున్నారు.ఈ చిత్రానికి కథను వక్కంతం వంశీ అందించారు. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి నవీన్‌ నూలి ఎడిటర్‌గా, అవినాష్‌ కొల్లా ఆర్ట్‌ డైరెక్టర్‌ గా పని చేస్తున్నారు. అజయ్‌ సుంకర, దీపా రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఏప్రిల్‌ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలౌతుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement