Monday, April 29, 2024

దొంగలెక్కలు సృష్టించడంలో ఆర్థిక మంత్రి దిట్ట : నారా లోకేష్‌

నంద్యాల : దొంగలెక్కలు సృష్టించడంలో ఆర్థిక మంత్రి దిట్ట అని టిడిపి యువనేత నారా లోకేష్ అన్నారు. శుక్రవారం పాములపాడు వద్ద ఎస్సీలతో ముఖాముఖి నిర్వహించారు… ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన దొంగ లెక్కలు బాగా రాస్తాడు అని.. నిధులు కేటాయిస్తాడే తప్ప, ఖర్చు చేయడన్నారు. టీడీపీ పరిపాలనలో దళితులకు ఖరీదైన వాహనాలు కొని స్వయం ఉపాధి కల్పించాం అన్నారు. దళిత సంక్షేమానికి రూ.40వేల కోట్లు ఖర్చు చేశామ‌ని, 3 వేల ఎకరాలు కొనుగోలు చేసి దళితులకు ఇచ్చాం అన్నారు. దళిత విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడానికి బెస్ట్ అవైలబుల్ పాఠశాలలు, ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చాం. విదేశీవిద్య పథకాన్ని అమలు చేసి విదేశాల్లో చదివించాం అన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ పథకాలన్నింటినీ రద్దు చేశాడు. 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టని పథకాలను కూడా చంద్రబాబు అమలు చేశారు. జగన్మోహన్ రెడ్డి దళితులకు సంబంధించిన 27 పథకాలు రద్దు చేశాడు. అంబేద్కర్ పేరును విదేశీవిద్య పథకానికి చంద్రబాబు పెడితే, జగన్ దానిని తీసేసి తన పేరు పెట్టుకున్నాడు అన్నారు. మేం అధికారంలోకి వచ్చాక దళితులకు జానాభా దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయించి, ఖర్చు చేస్తాం అన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్యనందించడానికి బెస్ట్ అవెయిలబుల్ స్కూల్స్ పథకం తెచ్చాం.. దానిని జగన్ రద్దు చేశాడు అని గుర్తు చేశారు. మేం అధికారంలోకి వచ్చాక ఈ పాఠశాలలను తిరిగి ప్రారంభిస్తాం అన్నారు. 2014లో రూ.16వేల కోట్ల లోటు బడ్జెట్ లోనూ రాష్ట్రంలో సంక్షేమాన్నిఅందించిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో యువతకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదు అన్నారు. 2025 జనవరిలో మేం మెగా డీఎస్సీ ప్రకటిస్తాం అన్నారు.. 5 ఏళ్లలో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తాం అన్నారు. రాయలసీమ ముద్దు బిడ్డనని చెప్పుకుంటున్న జగన్ ఈ రాయలసీమ కోసం ఏం చేశాడు? అని ప్ర‌శ్నించాడు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గతంలో 2.70లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించాం, ఈసారి 5లక్షల మందికి ఉపాధి కల్పిస్తాం అన్నారు.

చంద్రబాబు పాలనలో ఏనాడూ విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, జగన్ వచ్చాక ఇప్పటికి 8సార్లు పెంచారు అని గుర్తు చేశారు. మీరు కాల్చే ప్రతి యూనిట్ లో జగన్మోహన్ రెడ్డి రూ.1 లంచంగా తీసుకుంటున్నాడు అని, మేం అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీలను సమీక్షిస్తాం, దళితులకు 200యూనిట్లు విద్యుత్ ను ఉచితంగా అందిస్తాం అన్నారు. జగన్మోహన్ రెడ్డి వివిధ కారణాలతో కట్ చేసిన పెన్షన్లను మేం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాం అన్నారు. చంద్రబాబు పాలనకు ముందు ఉన్న ఏ పథకాన్ని మేం రద్దు చేయలేదు అని, జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక చంద్రబాబు పాలనలో అమలైన పథకాలన్నీ రద్దు చేశాడు అన్నారు. కులం, మతం, ప్రాంతాల ప్రకారం ప్రజలను విడదీస్తోంది. మీ వివరాలు ఇవ్వండి. మీ పిల్లలను చదివించే బాధ్యతను మేం తీసుకుంటాం అన్నారు. మేం అధికారంలోకి వచ్చాక శ్రీశైలం ముంపు బాధితులను ఆదుకుంటాం అన్నారు. జీఓ 98ను అమలు చేస్తాం.. మ్యానిఫెస్టోలో స్పష్టతనిస్తాం అన్నారు. ఆటో డ్రైవర్లకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం అని, ఇన్సూరెన్సు భారాన్ని తగ్గిస్తాం అన్నారు. అధికారంలోకి వచ్చాక పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తాం అని లోకేష్ అన్నారు. ఎస్సీ వర్గీకరణ విధానం సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది.. కర్ణాటక లో ఎస్సీ వర్గీకరణ తీర్మానం చేశారు అని గుర్తు చేశారు. చంద్రబాబు పాలనలో జి.ఓ 25 తెచ్చి దళిత సంక్షేమ పథకాలను ఉపకులాలకు అమలు చేశారు. 2014-19 మధ్య దళితులకు మేం ఏం చేశామో, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో చర్చించడానికి మేం సిద్ధం అన్నారు. సాంఘిక సంక్షేమమంత్రి బహిరంగచర్చకు రావాలి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement