Thursday, May 2, 2024

కరోనాపై పోరాటం భేష్‌..వైద్యులు, నర్సులకు రుణపడి ఉన్నాం : రామ్‌నాథ్‌ కోవింద్‌..

కరోనా మహమ్మారిని కలిసికట్టుగా అడ్డుకున్నామని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పనితీరు అద్భుతంగా ఉందని, ఇతర దేశాలకు కూడా భారత్‌ సాయం చేసిందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. రానున్న 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కరోనా వ్యాక్సినేషన్‌ ప్రచారాన్ని సామూహిక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లారని అన్నారు. ఈ ఘనత కోట్లాది మంది దేశ ప్రజలద్వారానే సాధ్యమైందని తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో క్లిష్ట పరిస్థితుల్లో ఎక్కువ గంటలు పని చేస్తూ.. మానవాళికి వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు సేవలందించారని గుర్తు చేశారు. సేవ చేయడం అనే ప్రాథమిక కర్తవ్యాన్ని నెరవేరుస్తూనే పరిశుభ్రత ప్రచారాన్ని, కరోనా వ్యాక్సినేషన్‌ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లారని తెలిపారు. కరోనా మహమ్మారిని జయించే వరకు ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలన్నారు. విధులు, హక్కులు అనేవి ఒకే నాణ్యానికి రెండు వైపులా ఉంటాయన్నారు.

స్వరాజ్యం కలను సాకారం చేసేందుకు సాటిలేని ధైర్యాన్ని స్వాతంత్య్ర సమరయోధులు ప్రదర్శించారని, వారికి ఇవే ఘన నివాళి అని కోవింద్‌ ప్రకటించారు. అలాంటి వారిని స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు. మన సైనికులు, భద్రతా సిబ్బంది జాతీయ ఘనమైన ఈ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారని కొనియాడారు. హిమాలయాల్లో ఎముకలు కొరికే చలిలో.. ఎడారిలోని విపరీతమైన వేడిలో కుటుంబాలకు దూరంగా మాతృభూమిని కాపాడుతున్నారని అన్నారు. రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం.. స్వేచ్ఛ, సమానతం, సౌభ్రాతృత్వం ఉన్నాయని గుర్తు చేశారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ సేవలు చిరస్మరణీయమన్నారు. భారత రాజ్యంగం.. ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాగంగా గుర్తింపు పొందిందని తెలిపారు. గత నెలలో సీడీఎస్‌ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ ఆయన భార్యతో పాటు ఇతరులు హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందడం బాధించిందన్నారు. సదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐఎన్‌సీ విక్రాంత్‌ త్వరలోనే జాతికి అంకితం చేస్తున్నామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement