Monday, April 29, 2024

FIFA World Cup | తొలి టైటిల్ కైవ‌సం చేసుకున్న స్పెయిన్

సిడ్నీలో ఇవ్వాల (ఆదివారం) జరిగిన FIFA మహిళల ప్రపంచకప్ ఫైల‌న్ మ్యాచ్ లో ఇంగ్లాండ్‌పై 1-0 తేడాతో ఓడించి స్పెయిన్ టైటిల్‌ను కైవ‌సం చేసుకుంది. స్పెయిన్ కెప్టెన్ ఓల్గా కార్మోనా చేసిన ఏకైక గోల్ తో ఆమె జట్టును జయానికి చేర్చింది. స్పెయిన్‌కు ఇది చారిత్రాత్మక విజయం. ఇంగ్లండ్ వారి విధానంలో ఆధిపత్యం చెలాయించిన‌ప్ప‌టికీ.. స్పెయిన్ అద్భుతమైన ప్రయత్నంతో తొలి ప్రపంచకప్ టైటిల్ ని ద‌క్కించుకున్నారు. ఈ విజయంతో, జర్మనీ తర్వాత పురుషుల, మహిళల ప్రపంచ కప్‌లను గెలుచుకున్న రెండవ దేశంగా స్పెయిన్ నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement