Monday, April 29, 2024

AP | సీడబ్ల్యూసీలో చింతాకు మొండిచేయి .. సీమ నుంచి రఘువీరకు స్థానం

తిరుపతి (రాయలసీమ ప్రభన్యూస్ బ్యూరో) : అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఈ రోజు ప్రకటించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( సి డబ్ల్యూ సి ) జాబితాలో కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ కు చోటు దక్కలేదు. అనూహ్యంగా రాయలసీమ కు చెందిన సీనియర్ నాయకుడు ఎన్. రఘువీరారెడ్డి కి స్థానం దక్కింది. కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయి మార్గ నిర్దేశకత్వం చేసే సి డబ్ల్యూ సి స్థానానికి ఆ పార్టీ లో ప్రత్యేక గుర్తింపు ఉంటుందనె విషయం అందరికీ తెలిసిందే. అటువంటి సి డబ్ల్యూ సి నూతన జాబితా ను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆదినాయకత్వం ప్రకటించింది. అందులో 39 మందికి సి డబ్ల్యూ సి సభ్యత్వాలు లభించగా, మరో 18 మందికి శాశ్వత ఆహ్వానితులుగా, 14 మందికి ఇన్ ఛార్జిలు గా, 9 మందికి ప్రత్యేక ఆహ్వానితులు గా, నలుగురికి ఎక్స్ ఆఫీషియో సభ్యత్వాలు దక్కాయి.

ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నలుగురైదుగురికి స్థానం లభించింది. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా సి డబ్ల్యూ సి సభ్యుడుగా, ప్రత్యేక ఆహ్వానితుడు గా కొనసాగిన మాజీ కేంద్ర మంత్రి తిరుపతి కి చెందిన చింతా మోహన్ కు ఈ సారి ఏ పదవి దక్కలేదు. అనూహ్యంగా రాష్ట్ర మంత్రిగా, పి సి సి అధ్యక్షుడు గా పనిచేసి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన అనంతపురం జిల్లాకు చెందిన ఎన్. రఘువీరా రెడ్డి కి సి డబ్ల్యూ సి సభ్యత్వం దక్కింది. ఈ అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement