Friday, April 26, 2024

వైరల్ గా రాధ డ్యాన్స్.. ట్వీట్ చేసిన సీనియర్ నటి

ముంబయిలో 80వ దశకానికి చెందిన సినిమా నటులు గెట్ టు గెదర్ పార్టీని చేపట్టారు.ఈ పార్టీలో దక్షిణాది తారలకు బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్, పూనమ్ థిల్లాన్ వంటి బాలీవుడ్ తారలు ఆతిథ్యమిచ్చారు. ఈ సందర్భంగా సీనియర్ నటీ నటులందరూ ఉత్సాహంగా ఆడిపాడారు. ఈ కార్యక్రమానికి హాజరైన అలనాటి అందాల నటి రాధ తన డ్యాన్స్ తో అలరించారు. అప్పట్లో చిరంజీవికి ఈడుజోడు అన్నట్టుగా వేగంగా డ్యాన్స్ చేసి అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన రాధ… ముంబయిలో జరిగిన కార్యక్రమంలోనూ ఆనాటి స్టయిల్ ను మిస్ కాకుండా డ్యాన్స్ చేశారు.

ఓ హిందీ హిట్ పాటకు ఆమె స్టెప్పులు వేస్తుండగా మెగాస్టార్ చిరంజీవి వావ్, ఫెంటాస్టిక్ అంటూ ముగ్ధుడయ్యారు. అంతేకాదు, లేచి వచ్చి మరీ ఒకనాటి తన హీరోయిన్ ను అభినందించారు. విక్టరీ వెంకటేశ్ సైతం రాధ డ్యాన్సుకు ఫిదా అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను రాధ తన ట్విట్టర్ అకౌంట్లో పంచుకున్నారు. తన ఫేవరెట్ సాంగ్ కు డ్యాన్స్ చేయడం ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. అంతకంటే ముఖ్యంగా, చిరంజీవి, వెంకటేశ్, జాకీ ష్రాఫ్, పూనమ్ థిల్లాన్, స్వప్న, సరిత అక్క వంటి వారు అభినందనల జల్లు కురిపించడం మరింత ఆనందానికి గురిచేసిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement