Thursday, May 2, 2024

ఎఫ్‌సీఐలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ప్రభుత్వరంగ సంస్థ ఫుడ్ కార్పొరేషన్‌ ఇండియా దేశ వ్యాప్తంగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 89 పోస్టులకు గానూ దరఖాస్తులను ఆహ్వానించగా.. ఇవాళే ఆఖరు తేదీ. అసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి. https://fci.gov.in/ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

అసిస్టెంట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ (టెక్నిక‌ల్)‌ 27 ఖాళీలు, అసిస్టెంట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ (అకౌంట్స్)‌ 22 ఖాళీలు,
అసిస్టెంట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ (అడ్మినిస్ట్రేషన్), మెడిక‌ల్ ఆఫీస‌ర్‌ 2 ఖాళీలు, అసిస్టెంట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ (లా) 8 ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ పోస్టుల‌కు రూ.60,000 నుంచి రూ.1,80,000 జీతం  ఉంటుంది. ఇక, మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టు‌ల‌కు రూ.50,000 నుంచి రూ.1,60,000 వరకు ఉంటుంది.ఈ పోస్టులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇక రాత ప‌రీక్షలో 50శాతం మార్కులు సాధించిన వారిని మాత్రమే ఇంటర్వ్యూలకు పిలుస్తారు. అయితే ఈ పరీక్ష మొత్తం ఆన్‌లైన్ ద్వారానే నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement