Tuesday, May 21, 2024

తండ్ర‌యిన న‌వీన్ చంద్ర‌.. ఫొటో పోస్ట్ చేసిన హీరో

అందాల రాక్షసి సినిమా ద్వారా నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకొని.. ఆ తర్వాత డిఫరెంట్ సినిమాలో.. క్యారెక్టర్స్ తో ప్రత్యేకమైన పేరు తెచ్చుకున్నాడు హీరో న‌వీన్ చంద్ర‌. హీరోగానే కాకుండా విల‌న్ గా కూడా దూసుకుపోతున్నాడు.కాగా
సాధారణంగా తన వ్యక్తిగత జీవితం గురించి బయటకు చెప్పుకోరు నవీన్ చంద్ర.రీసెంట్ గా ఆయ‌న‌ తండ్రి అయ్యారు. ఆయన భార్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.. ఈ గుడ్ న్యూస్ నవీన్ చంద్ర సోషల్ మీడియా పోస్ట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. మాకు బాబు పుట్టాడు అంటూ తన ఆనందాన్ని పోస్టు ద్వారా వెల్లడించారు. దీంతో ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా నవీన్ చంద్ర దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం నవీన్ తన బాబుతో దిగిన ఫోటోలను షేర్ చేసుకోగా అవి వైరల్ గా మారాయి. అందులో అబ్బాయి కూడా చాలా క్యూట్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement