Tuesday, May 21, 2024

భారీగా గంజాయి పట్టివేత.. ముగ్గురు అంత‌ర‌రాష్ట్ర స్మగ్ల‌ర్ల అరెస్ట్…

ప్ర‌భుత్వం ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తీసుకొచ్చినా గంజాయి అక్ర‌మ ర‌వాణా ఆగ‌డం లేదు. ఏదోఒక చోట గంజాయి ప‌ట్టుబ‌డుతూనే ఉంది. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ నుంచి మహారాష్ట్రలోని అమరావతికి అక్రమంగా తరలిస్తుండ‌గా పోలీసులు ప‌ట్టుకున్నారు. దాదాపు 92 కిలోల గంజాయిని ఆదిలాబాద్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు అంతరరాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్‌ చేశారు. రెండు కార్లలో నలుగురు నిందితులు గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా మావల వద్ద పట్టుకున్నట్లు ఎస్పీ ఉదయ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. వీరు ఉట్నూర్‌కు చెందిన మహమ్మద్‌ సద్దాం, రెహ్మాన్‌ ఖాన్‌, పవర్‌ రాజు, శ్రీకర్‌ గత కొన్ని రోజులుగా ఆంధ్రా, ఒడిశా ప్రాంతాల నుంచి గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి మహారాష్ట్రలో అధిక ధరలకు అమ్ముతున్నారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement