Thursday, May 2, 2024

Vinod Thomas: ప్రముఖ మలయాళ నటుడు మృతి

మలయాళ నటుడు వినోద్ థామస్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. కొట్టాయం జిల్లా పాంపడి ప్రాంతంలోని ఓ హోటల్‌ సిబ్బంది తమ హోటల్ పరిసరాల్లో కారులో ఓ వ్యక్తి చాలాసేపు చలనం లేకుండా ఉండిపోవడం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో, వినోద్ మరణం గురించి వెలుగులోకి వచ్చింది. కారులో విగతజీవిగా పడి ఉన్న ఆయనను గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించాం. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు అని స్థానిక పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement