Monday, April 29, 2024

దంచికొడుతున్న ఎండలు, 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు.. తీవ్రంగా వీస్తున్న వడగాలులు

జిల్లాల్లో వడగాలులు వణికిస్తున్నాయి. భానుడి భగభగ మండుతున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓవైపు ఉక్కపోత, మరోవైపు వేడిమి త్రీవంగా ఉంది. దీంతో చిన్న పిల్లల వద్ద నుంచి పెద్దల వరకు ఎండల దెబ్బకు విలవిలలాడుతున్నారు. 40సెల్సియస్‌ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. వీటికి తోడు వేడి గాలులు వీస్తుండడంతో ఉష్ణోగ్రతలు దంచికొడుతున్నాయి. ఎండ తీవ్రతకు తట్టుకోలేని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇదే సమయంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతవరణ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని వృద్ధులు, పిల్లలు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేడివల్ల డిహైడ్రేషన్‌ బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఉదయం 8 గంటల నుంచే ఎండ త్రీవత అధికమవ్వడంతో ప్రధాన రహదారులన్ని బోసిపోతున్నాయి. సొంత పనుల మీద బయటకు వెళ్ళాలనుకున్న వారు ఎండ తీవ్రత కారణంగా తమ పనులను వాయిదా వేసుకుంటున్నారు .ఈ ఎండలకు భయటకు పోయేదేమి అనే ఆలోచనలో పడుతున్నారు. ఇక ప్రభుత్వ ప్రైవేట్‌ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ఎండవే డిమికి తోడు ఉత్తరం ప్రాంతం నుంచి వీస్తున్న వడ గాలులు వీటిని మరింత ఉక్కపోతకు గురిచేస్తున్నట్లు వాతవరణ నిపుణులు పేర్కొంటున్నారు.

వడదెబ్బల పట్ల అప్రమత్తం అవసరం..

ఎండ తీవ్రత వల్ల బయట తిరగరాదని వైద్యులు సూచిస్తున్నారు. ఒకవేళ పనిపై బయటికి వచ్చినా పల్చటి దుస్తులు, ఎండ నుంచి బయటపడేందుకు గొడుగు వినియోగించాలని పేర్కొంటున్నారు. అంతే కాకుండా నేరుగా సూర్య కిరణాలు మోహాలపై పడకుండా టోపి, తలపాగా వంటివి ధరించాలంటున్నారు. పిల్లలు ఎక్కువగా ఎండలో అడనివ్వవద్దని, వడదెబ్బ తగిలే అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా నీళ్లతో పాటు దాహం తీర్చుకునేందుకు మజ్జిగ, సన్నారి, గ్లూకోజ్‌, నిమ్మరసంతో కూడిన ద్రవంను సేవించాలని సూచిస్తున్నారు. శీతల పానీయాల కన్న నిమ్మరసంతో కూడిన ద్రవంను సేవించడం క్షేమకరమని పేర్కొంటున్నారు. నిమ్మ రసం తీసుకోవడం వల్ల తిరిగి శరీరంలో శక్తి సమకూరే అవ కాశం ఉంటుందంటున్నారు. అలాగే కొబ్బరి నీళ్లు చెరుకురసాలు సేవించడం కూడ శరీరానికి మేళంటున్నారు. ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో వైద్యు లు వడదెబ్బకు గురికాకుండా తీసు కోవాల్సిన జాగ్రత్తలపై ముందస్తుగా హెచ్చరిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement