Thursday, April 25, 2024

ఈవీఎంలు క‌రాబ్..ఈసీకి ఫిర్యాదు..ఈటెల‌

త‌న‌ను ఓడించడానికి సీఎం కెసిఆర్ అన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేశార‌ని బిజెపి అభ్య‌ర్థి ఈటెల రాజేంద‌ర్ ఆరోపించారు. డబ్బులు పంచారు, మందు పంచారు, బెదిరించారు, మభ్యపెట్టారు. చివరికి పోలింగ్ సిబ్బందికి కూడా దావత్ ఇచ్చి డబ్బులు ఇచ్చి మభ్యపెట్టే ప్రయత్నం చేశారన్నారు. ఇన్నీ చేసిన కూడా గెలవలేమ‌నే భ‌యంతో ఇలాంటి పనులు చేస్తున్నారన్నారు. ఆత్మను ఆవిష్కరించి ఓటు వేసిన తరువాత కూడా .. ఓటు వేసిన బాక్స్ లు కూడా మాయం చేయడం దుర్మార్గపు చ‌ర్య అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈవీఎంలు క‌రాబ్ అయ్యాయ‌ని మార్చ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తుంద‌న్నారు. ఈ విష‌యంపై ఎన్నికల కమీషన్ కి ఫిర్యాదు చేస్తున్నామ‌రి ఈటెల తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. హుజురాబాద్ ప్రజలు ఇచ్చిన తీర్పు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. చారిత్రాత్మక ఘట్టం ఇద‌ని అన్నారు. కాగా కలెక్టర్ పొరపాటు జరిగింది అని చెప్తున్నారు. ఇది మామూలు ఎన్నిక కాదు. ఇంత ఉత్కంఠ భరితంగా జరిగిన ఎన్నికలలో ఇంత నిర్లక్ష్యమా అని ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement