Thursday, April 18, 2024

Deepawali: పటాకులతో జర పైలం.. ఏవి పడితే అవి కాలుస్తే భారీ ఫైన్ వేస్త‌ర‌ట‌..

దీపావళి వస్తోంది. ముందుగాల్నే పటాకులు కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటారు చాలామంది. మరి ఈ సారి సుప్రీం కోర్టు చాలా సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చింది. ఏవి పడితే అవి కాలిస్తే.. పెద్ద మొత్తంలో ఫైన్‌ వేయాలని ప్రభుత్వాని చెప్పింది. అధికారులు కూడా దీన్ని సీరియస్‌గానే తీసుకుని యాక్షన్‌ చేపట్టారు. మరి ఎట్లాంటి పటాకులు కాల్వల్నో తెలుసా..

కాలుష్యాన్ని విరజిమ్మే పటాసులకు తెలంగాణ ప్రభుత్వం స్వస్తి పలకనుంది. ఈ వారంలో జరగనున్న దీపావళి పండుగను కాలుష్య కోరల నుండి విడిపిస్తూ దీపాల వెలుగులతో, హరిత టపాకులతో జరపడానికి ప్రభుత్వం చర్యలను తీసుకుంటుంది. పర్యావరణానికి హాని చేసే టపాసుల తయారీ, విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వం నిరంతర నిఘా ఉంచింది. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీ, పట్టణాభివృద్ధి అధికారులతో పాటు, పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. వీటిని నిషేధిస్తూ ఇప్పటికే గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఆదేశాలు జారీ చేసింది.

బేరియంతో తయారయ్యే టపాసుల వల్ల పర్యావరణంతో పాటు ప్రజలలో వచ్చే శ్వాసకోశ సంబంధిత వ్యాధులపై అధికారులు ప్రజల్లో అవగాహణ కల్పిస్తున్నారు. పర్యావరణ కాలుష్యంపై పేలుడు పదార్ధాల చెడు ప్రభావాల గురించి ప్రజల్లో అవగాహనను పెంచేందుకు అధికారులు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో ప్రభుత్వంతో పాటు, పలు స్వచ్ఛంద సంస్థలు బాణాసంచా, టపాకుల వినియోగం పట్ల ప్రకృతి ఎదుర్కొనే సమస్యలను వివరిస్తున్నారు. దీపాల పండగకు ఉచిత మట్టి ప్రమిదలను పంపిణీ చేస్తూ, హరిత టపాకుల విక్రయాలను ప్రోత్సహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement