Sunday, May 12, 2024

ఇక చాలు, దుస్సాహం వద్దు.. పుతిన్‌కు జో బైడెన్‌ హితవు

ఉక్రెయిన్‌ సేనల చేతిలో ఎదురైన పరాభవం చాలని.. అందుకు ప్రతీకారంగా ఎలాంటి దుస్సాహసానికి పాల్పడవద్దని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్‌ పుతిన్‌కు విజ్ఞప్తిచేశారు. ఓ ఇంటర్వ్యూలో బైడెన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యన్‌ బలగాలకు భారీ నష్టం వాటిల్లుతోంది. ఇకనైనా మాస్కో వెనక్కి తగ్గితే మంచిది. ప్రతీకారానికి పోయి అణ్వాయుధాలు లేదా రసాయన ఆయుధాలు ప్రయోగించాలని భావించొద్దు.

ఒకవేళ అలాంటి ఆలోచన చేస్తే, అది పూర్తిగా యుద్ధం స్వరూపాన్నే మార్చివేస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ దాడుల పర్యవసానాలపై ఆధారపడి అమెరికా స్పందన ఉంటుందని పరోక్షంగా మాస్కోను హెచ్చరించారు. కానీ, పర్యవసానాల వివరాలపై మాత్రం సమాధానం దాటవేశారు. అణు, రసాయన దాడులకు పాల్పడితే ప్రపంచ వేదికపై రష్యా పరిస్థితి మరింత దిగజారుతుందని చెప్పారు. ఆ దేశం వ్యవహారశైలిని బట్టి ఇతర దేశాల స్పందన ఉంటుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement