Saturday, May 4, 2024

వర్ష బర్త్ డేకి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన ఇమ్మానియేల్

జబర్థస్త్ వర్షకి కమెడియన్ ఇమ్మానియేల్ ఖరీదైన హారాన్ని గిప్ట్ గా ఇచ్చాడు. పంజాగుట్టలోని నగల దుకాణానికి తీసుకెళ్లి ఖరీదైన హారం కొనిపెట్టాడు. ఇమ్మానియేల్ ఇచ్చిన గిఫ్ట్ కి వర్ష ఫిదా అయ్యింది. తనకు ఎంతగానో నచ్చినట్లు చెప్పింది. త్వరలో వర్ష బర్త్ డే కాగా ఇలా సర్ప్రైజ్ చేశాడట. పనిలో పనిగా ఇమ్మడి అనే సిల్వర్ గోల్డ్ షాప్ ని ఇమ్మానియేల్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రమోట్ చేశాడు. వర్ష, ఇమ్మానియేల్ షాప్ అంతా తిరిగి కలెక్షన్ గురించి వివరించారు. ఇది ప్రమోషనల్ వీడియో అని స్పష్టంగా తెలుస్తుంది. మరి ఇమ్మానియేల్ వర్షకు జ్యుయలరీ గిఫ్ట్ గా ఇచ్చాడా లేదా అనేది మాత్రం సస్పెన్సు. గత రెండేళ్లుగా బుల్లితెరపై వర్ష-ఇమ్మానియేల్ వీరవిహారం చేస్తున్నారు. తమని తాము లవర్స్ గా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. అది వాళ్ళిద్దరి కెరీర్ కి ప్లస్ అయ్యింది. కామెడీ స్కిట్స్, షోస్ లో ఇమ్మానియేల్ వర్ష రొమాన్స్, కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకోగా ఆఫర్స్ వచ్చిపడుతున్నాయి. ముఖ్యంగా వర్ష ఇమ్మానియేల్ పై వల్లమాలిన ప్రేమ చూపిస్తుంది. ఇమ్మానియేల్ నా అదృష్టం అని చెప్పుకునే వర్ష, జీవితంలో అతన్ని వదిలేది లేదు అంటుంది. ఒక సందర్భంలో పెళ్లి నీతోనే వెళ్లి అత్తమ్మ కు చెప్పు నేను వస్తున్నానని వర్ష చెప్పారు. వాళ్ళ మనస్సులో ఏమైనా ఉండనీ ప్రేమికులు అన్నట్లు కలరింగ్ ఇస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement