Sunday, April 28, 2024

ఎలాన్ మస్క్ కీల‌క ప్ర‌క‌ట‌న‌.. ‘X’లో ఆడియో, వీడియో కాల్స్..

ఎలోన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X త్వరలో వీడియో & ఆడియో కాలింగ్‌ను అందించనుంది. ఇవ్వాల (గురువారం) మస్క్ ఈ కొత్త ఫీచర్లలో X ని “ఎవ్రీథింగ్ యాప్”గా మార్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రకటించారు. “Xకి త్వ‌ర‌లో వీడియో & ఆడియో కాల్‌లు వస్తున్నాయి” అని త‌న ఎకౌంట్ లో పోస్ట్‌లో రాశారు ఎలోన్ మస్క్. వీడియో & ఆడియో కాలింగ్ ఫీచర్లు iOS, Android, Ma, PC సిస్టమ్‌లలో అందుబాటులో ఉంటాయని.. ఫోన్ నంబర్ అవసరం లేదని ఎలోన్ మస్క్ పేర్కొన్నారు. అయితే, ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనేది పేర్కొనలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement