Friday, April 26, 2024

ట్విట్ట‌ర్ లో త‌న ప్రొఫైల్ పేరు మార్చుకున్న.. ఎలాన్ మ‌స్క్

ట్విట్ట‌ర్ లో త‌న ప్రొఫైల్ పేరు మార్చుకున్నారు ట్విట్ట‌ర్ యజమాని, టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. ట్విట్టర్ లోనే తన ప్రొఫైల్ పేరు వరకు మార్చుకున్నారు. మిష్టర్ ట్వీట్ అనేది ట్విట్టర్ వేదికపై ఎలాన్ మస్క్ కొత్త పేరు. సోషల్ మీడియాలో పేర్లు మార్చుకోవడం ఎలాన్ మస్క్ హాబీల్లో ఒకటి. ఇక నుంచి ఎలాన్ మస్క్ ట్విట్టర్ లో మిష్టర్ ట్వీట్ గానే కొనసాగుతారు. పేరును తిరిగి మార్చుకునేందుకు అవకాశం ఉండదు. తాను కొత్త పేరుకు స్టిక్ అవ్వాల్సిందేనని, తిరిగి పాత పేరుకు మారిపోవడానికి ట్విట్టర్ అనుమతించదని స్వయంగా మస్క్ ప్రకటించారు. మస్క్ మిష్టర్ ట్వీట్ అనే పేరు పెట్టుకోవడానికి వెనుక ఒక ఆసక్తికరమైన కోణం ఉంది. ట్విట్టర్ కు వ్యతిరేకంగా లోగడ కోర్టులో వ్యాజ్యం దాఖలు కాగా, దీనిపై వాదనలు జరుగుతున్నాయి. ఆ సమయంలో అటార్నీ అనుకోకుండా మిష్టర్ ట్వీట్ అని సంబోధించారు. ఇది మస్క్ కు తెగ నచ్చేసింది. దీంతో ప్రొఫైల్ కు మిష్టర్ ట్వీట్ అని నామకరణం చేసేశారు. దీనికింద ఎలాన్ మస్క్ అని కూడా ఉండడాన్ని గమనించొచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement