Thursday, October 3, 2024

Electric Shock | రోడ్డుపై తెగిపడ్డ విద్యుత్​ వైర్లు.. కరెంట్​ షాక్​తో వ్యక్తి మృతి

కుత్బుల్లాపూర్ (ప్రభ న్యూస్​): హైదరాబాద్​ కుత్బుల్లాపూర్​ పరిధి, మల్లంపేట డ్రీమ్ వ్యాలీ లో ఉంటున్న రెడ్డి సత్యనారాయణ రెడ్డి (57) విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఇవ్వాల (సోమవారం) ఉదయo మల్లంపేటలోని ఆకాశ లేఔట్ లో ఉన్న రోడ్డుపై తన ద్విచక్ర వాహనం మీద వెళ్తుంటే మార్గమధ్యలో తెగిపోయి పడి ఉన్న విద్యుత్ వైర్ అతనికి తగిలంది. ప్రమాదవశాత్తు వైరు తగలడంతో సత్యనారాయణరెడ్డి అక్కడికక్కడే చనిపోయాడు. వెంటనే అదే దారిలో వస్తున్న వారు బాచుపల్లి లోని మమత హాస్పిటల్ కి తరలించగా అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్ట పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement