Friday, February 23, 2024

ఈటెల రాజేందర్.. ఇంకా ఆరోగ్యశాఖ మంత్రేనా?

తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ తన పదవికి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి దాదాపు మూడు నెలలు దాటుతోంది. ఆయన బీజేపీలో చేరి హుజురాబాద్ ఉపఎన్నికలో బరిలో దిగేందుకు కూడా సన్నద్ధం అవుతున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై పలు విమర్శలు కూడా చేస్తున్నారు.

అయితే తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రిగా ఒకవైపు కేసీఆర్ కొనసాగుతుండగా మరోవైపు ఇంకా ఈటెల రాజేందర్ మంత్రిగానే ఉన్నారా అని పలు అనుమానాలు కలిగించేలా ప్రభుత్వ వాహనాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలంలో ‘ఆలన’ వాహనంపై ఇంకా ఈటెల రాజేందర్ ఫోటో తొలగించకపోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ ఆలన వాహనం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, ఆస్పత్రికి వెళ్లలేనివారికి వైద్యం అందుతోంది.

ఈ వార్త కూడా చదవండి: తెలంగాణలో స్కూళ్ల రీ ఓపెన్‌కు సర్కారు గ్రీన్ సిగ్నల్

Advertisement

తాజా వార్తలు

Advertisement