Tuesday, May 7, 2024

బొగ్గు అక్రమ మైనింగ్‌ కేసులో ఐపీఎస్‌ అధికారులకు ఈడీ సమన్లు..

పశ్చిమబెంగాల్‌లో బొగ్గు అక్రమ మైనింగ్‌, స్మగ్లింగ్‌జరిగిన ప్రాంతంలో 8 మంది ఐపీఎస్‌ అధికారులు వాటిగురించి తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ విధంగా ప్రభుత్వానికి సహకరించినట్లు ఆరోపణల నేపథ్యంలో అధికారులు విచారణకు రావాల్సిందిగా ఢిల్లిd నుంచి ఈడీ అధికారులు వారికి సమన్లు జారీ చేసినట్లు తెలిపారు. రాష్ట్ర అధికార పార్టీకి చెందిన బీర్బూమ్‌ జిల్లా అధ్యక్షుడు అనుబ్రత మోండల్‌ పశువుల అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు విచారించిన అనంతరం 10 రోజులు అదుపులోనికి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అనంతరం మైనింగ్‌కు సంబంధించి ఐపీఎస్‌ అధికారులు సుఖేష్‌జైన్‌, గ్యావంత్‌ సింగ్‌, మిశ్రా, శ్యాంసింగ్‌, సెల్వమురుగన్‌, కోటేశ్వశ్వరాలకు సమన్లుజారీ చేసి వచ్చేవారం విచారణకు రావాల్సిందిగా కోరింది. ఎవరెవరు ఎప్పుడువిచారణకు హాజరు కావాల్సింది తేదీలను ప్రకటించింది. ఆగస్టు 24 నుంచి 31 వరకు ఐపీఎస్‌ అధికారులను విచారించనుంది. గతేడాది క్రితమే కొందరు అధికారులకు సమన్లు అందాయి.

అధికారులకు అందిన నివేదికల ప్రకారం బొగ్గు మైనింగ్‌, స్మగ్లింగ్‌ జరుగుతున్న ప్రాంతాల్లో వీరంతా ఉన్నప్పటికీ చూసిచూడనట్లు వ్యవహరించినట్లు ఈడీ నివేదికలో తేలిందన్నారు. ఇదిలా వుండగా పశువుల అక్రమరవాణా కేసులో విచారణకు సహకరించడంలేదనే కారణంతో టీఎంసీ నేత అనుబ్రత మోండల్‌ను సీబీఐ అధికారులు గురువారం అదుపులోనికి తీసుకున్నారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ ఆరోపణలు రుజువైన పక్షంలో మోండల్‌ను అరెస్టు చేస్తామన్నారు. ఇటీవల మంత్రి పార్థ చటర్జీ రిక్రూట్‌ మెంట్‌ అవినీతికి పాల్పడినట్లు వచ్చిన సందర్బంగా ఈడీ అదుపులోనికి తీసుకొని విచారిస్తోంది. దీంతో టీఎంసీలో అలజడి రేగింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్రంలో అటు పార్టీ నేతలు, ఇటు అధికారులపై నిఘా ఉంచడంపై రాజకీయ ప్రాధాన్యం సంతరించకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement