Saturday, May 4, 2024

CSK vs KKR | కోల్‌కతాపై ఈజీ విక్టరీ.. ట్రాక్‌లోకి వచ్చిన సీఎస్‌కే..

చెన్నై చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. 138 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై.. 3 వికెట్ల న‌ష్టానికి 141 ప‌రుగులు చేసి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి (67 నాటౌట్) హాఫ్ సెంచరీతో మెప్పించాడు. రచిన్ రవీంద్ర(15), డారిల్ మిచెల్ (25), చివర్లో శివమ్ దూబే(28) విజయానికి 3 పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు.

చెలరేగిన జడేజా, తుషార్

ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. చెన్నై బౌల‌ర్ల ధాటికి నిర్ణీత 20 138 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది కోల్‌కతా జట్టు. తుషార్ దేశ్‌పాండే, రవీంద్ర జడేజా చెరో మూడు వికెట్లతో చెలరేగారు. ఇక ముస్తాఫిజుర్ రెహమాన్ రెండు వికెట్ల తీయగా.. మహేశ్ తీక్షణ ఒక్క వికెట్ దక్కించుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement