Saturday, May 4, 2024

అందుబాటులోకి వచ్చిన.. అతి చిన్న ఎలక్ట్రిక్ కారు ఈఏఎస్-ఇ

అతి తక్కువ ధరకి ఎలక్ట్రిక్ కారు అందుబాటులోకి వచ్చింది. పూణేకు చెందిన పీఎంవీ ఎలక్ట్రిక్ కంపెనీ ఈఏఎస్-ఇ కారుని రిలీజ్ చేసింది.దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.4.79 లక్షలుగా ఉంది. దీనికి స్థానిక రవాణా పన్నులు, బీమా చార్జీలు, యాక్సెసరీల చార్జీ అదనం. మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్ కార్లలో తక్కువ రేటు వాహనం ఇదే. అయితే రూ.4.79 లక్షల ధర మొదటగా బుక్ చేసుకునే 10 వేల యూనిట్లకే వర్తిస్తుందని పీఎంవీ ఎలక్ట్రిక్ తెలిపింది. అధికారికంగా విడుదల చేయడానికి ముందే 6,000 యూనిట్లకు బుకింగ్ లు వచ్చాయి. పీఎంవీ వెబ్ సైట్ కు వెళ్లి రూ.2,000 చెల్లించి కారు కోసం బుక్ చేసుకోవచ్చు.ఇద్దరు పెద్దలు, ఒక చిన్నారి కూర్చుని ఈ కారులో ప్రయాణించొచ్చు. పట్టణాల్లో ప్రయాణానికి ఎంతో సౌకర్యంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. 9.56 అడుగుల పొడవు, 3.79 అడుగుల వెడల్పుతో ఉంటుంది. ఎత్తు 5.24 అడుగులు. కారు బరువు 550 కిలోలు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement