Sunday, April 28, 2024

భారత్‌లో ఈ-కామర్స్‌ జోరు, పెరుగుతున్న మార్కెట్‌ వాటా.. ఎఫ్‌ఐఎస్‌ నివేదికలో వెల్లడి

న్యూఢిల్లిd : భారత్‌లో ఈ-కామర్స్‌ వినియోగదారుల సంఖ్య రోజురోజుకూ భారీగా పెరుగుతున్నది. ఈ-కామర్స్‌ మార్కెట్‌ కూడా దేశంలో మారుమూల ప్రాంతాల వరకు విస్తరిస్తున్నది. ఫైనాన్షియల్‌ టెక్నాలజీ లీడర్‌ ఎఫ్‌ఐఎస్‌ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. 2015 నుంచి 2021 మధ్య 96 శాతం పెరుగుతుందని వివరించింది. దీని విలువ సుమారు 120 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని ఎఫ్‌ఐఎస్‌ అంచనా వేసింది. ఎఫ్‌ఐఎస్‌ నుంచి వరల్డ్‌ పే ద్వారా.. 2022 గ్లోబల్‌ చెల్లింపుల నివేదిక 5 ప్రాంతాల్లో.. 41 దేశాల్లో.. ప్రస్తుత, భవిష్యత్తు చెల్లింపుల ట్రెండ్‌లను పరిశీలిస్తున్నది. 2021కి సంబంధించి.. ఆన్‌లైన్కు మారడం ప్రపంచ ఈ-కామర్స్‌లో 13.9 శాతం వృద్ధితో కొనసాగిందని నివేదిక తెలియజేసింది. అయితే పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) లావాదేవీ విలువలో 13.4 శాతం వృద్ధి కరోనా ప్రభావంగా నమోదైందని పేర్కొంది. భారత్‌ ఈ-కామర్స్‌ మార్కెట్‌ 2021 నుంచి 2025 మధ్య 96 శాతం వృద్ధి చెందుతుందని ఎఫ్‌ఐఎస్‌ అంచనా వేయబడింది. ఇది లావాదేవీల విలువలో 120 బిలియన్‌ డాలర్లను అధిగమిస్తుందని భావిస్తున్నది.

క్రెడిట్‌ కార్డులతో 13.3 శాతం..

ప్రముఖ ఈ-కామర్స్‌కు సంబంధించిన చెల్లింపులను పరిశీలిస్తే.. డిజిటల్‌ వ్యాలెట్ల ద్వారా 45.4 శాతం, డెబిట్‌ కార్డుల ద్వారా 14.6 శాతం, క్రెడిట్‌/ఛార్జ్‌ కార్డుల ద్వారా 13.3 శాతం చెల్లింపులు జరిగినట్టు ఎఫ్‌ఐఎస్‌ నివేదిక ద్వారా స్పష్టమైంది. 2025 నాటికి మొత్తం లావాదేవీల విలువలో డిజిటల్‌ వాలెట్లు 52.9 శాతం వాటాను ఆక్రమిస్తాయని అంచనా వేశారు. ఇతర ఈ-కామర్స్‌ చెల్లింపు పద్ధతుల కంటే తమ ఆధిక్యాన్ని పెంచుతాయని అంచనా వేయబడింది. ఇప్పుడు కొనుగోలు చేయండి.. తరువాత చెల్లించండి.. అనే పద్ధతి భారతదేశంలో ఎంతో వేగంగా వ్యాపిస్తున్నది. దీంతో ఆన్‌లైన్‌ చెల్లింపుల పద్ధతి పెరిగింది. బీఎన్‌పీఎల్‌ 2021లో కేవలం 3 శాతం నుంచి 2025 నాటికి ఈ -కామర్స్‌ మార్కెట్‌ విలువలో 8.6 శాతానికి పెరుగుతుందని అంచనా వేయబడింది.

తగ్గిన క్యాష్‌ ఆన్‌ డెలివరీ..

ప్రీపెయిడ్‌ కార్డులు, బ్యాంకు బదలీలు, క్యాష్‌ ఆన్‌ డెలివరీ మార్కెట్‌ వాటాలను తగ్గించాయి. 2025 నాటికి ఈ – కామర్స్‌ లావాదేవీ విలువలో సమిష్టిగా కేవలం 8.8 శాతం మాత్రమే ఉంటుందని ఎఫ్‌ఐఎస్‌ అంచనా వేయబడింది. పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) పేమెంట్‌ ట్రెండ్‌ కూడా భారత్‌లో కొనసాగుతున్నది. భారత్‌ పీఓఎస్‌ మార్కెట్‌ 2021-2025 మధ్య 28.8 శాతం పెరుగుతుందని అంచనా వేయబడింది. దీని విలువ 1.08 ట్రిలియన్‌ డాలర్లకు మించి ఉంటుందని ఎఫ్‌ఐఎస్‌ తన నివేదికలో స్పష్టం చేసింది. 2021కు సంబంధించి ట్రాన్సాక్షన్స్‌లో 37.1 శాతం నగదు చెల్లింపు పద్ధతిలో అగ్రగామిగా ఉంది. ఆ తరువాత డిజిటల్‌ వాలెట్‌ 24.8 శాతం, క్రెడిట్‌/ఛార్జ్‌ కార్డులు 18.1 శాతంగా ఉన్నాయి. డిజిటల్‌ వాలెట్లు 2023 నాటికి పీఓఎస్‌ లావాదేవీల విలువలో 30.8 శాతంగా అంచనా వేయబడినప్పుడు.. నగదును అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్‌స్టోర్‌ చెల్లింపు పద్ధతిగా మారుస్తామయని అంచనా వేశారు.

- Advertisement -

సౌకర్యవంతమైన కొనుగోళ్లపైనే దృష్టి..

ఈ సందర్భంగా ఎఫ్‌ఐఎస్‌, వరల్డ్‌పే మర్చంట్‌ సొల్యూషన్స్‌ ఏపీఏసీ జనరల్‌ మేనేజర్‌ ఫిల్‌ పామ్‌ ఫోర్డ్‌ మాట్లాడుతూ.. భారతదేశంలో ఈ కామర్స్‌ పరిశ్రమ గత కొన్ని సంవత్సరాలుగా బలమైన వృద్ధిని సాధించిందన్నారు. ఈ వృద్ధి మందగించే సంకేతాలు కనిపించడం లేవని చెప్పుకొచ్చారు. కరోనా కారణంగా భారత్‌దేశం అంతటా.. ప్రజలు తమ షాపింగ్‌, కొనుగోలు నిర్ణయాలు తీసుకునే విధానంలో మార్పు వచ్చిందన్నారు. ప్రజలందరూ.. సౌకర్యవంతమైన షాపింగ్‌ను కోరుకుంటున్నారని, స్టోర్‌కు వెళ్లి కొనుగోలు చేయడానికి ఇష్టపడటం లేదన్నారు. ఈ సమయంలో స్టోర్స్‌లో మంచి షాపింగ్‌ అనుభవం అందించాల్సిన అవసరం వ్యాపారులపై కూడా ఉందన్నారు. భారత్‌లో ఈ-కామర్స్‌ మార్కెట్‌ పెరుగుతుండటంతో.. కొనుగోలుదారులకు సంతృప్తికరమైన సేవలు అందించేవారు పెరుగుతారన్నారని అభిప్రాయపడ్డారు. 46వేల మంది కొనుగోలుదారుల నుంచి అభిప్రాయ సేకరణ జరిగింది. ఎఫ్‌ఐఎస్‌ అనేది.. ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారులు, బ్యాంకులు, మూలధన మార్కెట్ల సంస్థలకు సాంకేతిక పరిష్కారాలను అందించే ప్రముఖ సంస్థ.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement