Tuesday, October 8, 2024

త్వ‌ర‌లో థియేటర్లలోకి దుల్కర్ సల్మాన్ ‘సీతా రామం’.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేక‌ర్స్..

సల్మాన్, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో హను రాఘవపూడి దర్శకత్వం వ‌హించిన‌ రొమాంటిక్ కథ ‘సీతా రామంస‌. వైజయంతీ మూవీస్ సమర్పణలో తెర‌కెక్కిన‌ ఈ సినిమా ఇప్పుడు విడుదలకు సిధ్దంగా ఉంది. ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న‌ట్టు రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించారు మేక‌ర్స్. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. సుమంత్, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్, తరుణ్ భాస్కర్, శత్రు, భూమిక చావ్లా, రుక్మిణి విజయ్ కుమార్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ తదితరులు ‘సీతా రామం’లో ముఖ్య పాత్రలు వహిస్తున్నరు.

Advertisement

తాజా వార్తలు

Advertisement