Friday, April 19, 2024

ఇదో వింత: అచ్చం కుక్క‌లా మారిన మ‌నిషి.. 12 ల‌క్ష‌లు పోసి కొత్త అవ‌తారం ఎత్తాడు!

జ‌పాన్‌లో వింత ఘ‌ట‌న జ‌రిగింది. ఓ వ్య‌క్తి అచ్చం కుక్క‌లా మారిపోయాడు.. పైగా దానికోసం దాదాపు 12 ల‌క్ష‌ల‌కు పైగానే ఖ‌ర్చు చేశాడ‌ట‌.. అత‌ను కుక్క‌లా మారాడు అనేదానికంటే.. కుక్క అవ‌తారం ఎత్తాడ‌ని చెప్పొచ్చు. జపాన్‌కు చెందిన టోకోకు నాలుగు కాళ్లున్న జంతువుగా మారిపోవాలన్న కోరిక కలిగింది. అయితే.. కుక్క రూపమైతే తనకు సరిగ్గా సరిపోతుందని భావించాడ‌ట‌.. దీంతో ఒళ్లంతా బొచ్చుతో పెద్దగా ఉండే జాతి కుక్క ‘కోలీ’గా మారిపోవాలనుకున్నాడు. దీని కోసం జెప్పెట్ అనే ప్రొఫెషనల్ ఏజెన్సీని సంప్రదించాడు. కాగా, జపాన్‌లో పలు సినిమాలు, టీవీ షోలు, వినోదాత్మక కార్యక్రమాలకు కాస్ట్యూమ్స్‌, మస్కట్ పాత్రల దుస్తులను జెప్పెట్ సంస్థ తయారు చేస్తుంది.

దీంతో రెండు మిలియన్‌ యెన్లు (సుమారు రూ.12 లక్షలకు పైగా) వ్యయంతో కూడిన జాతి కుక్క ‘కోలీ’ కాస్ట్యూమ్‌ను ఆ సంస్థ 40రోజుల్లో తయారు చేసింది. దీనిని ధరించిన టోకో, అచ్చం కుక్కలా మారిపోయాడు. కుక్క మాదిరిగా హావాభావాలు ప్రదర్శించాడు. కుక్క మాదిరిగా నడిచేందుకు కొంత ప్రయత్నించాడు. దీనికి సంబంధించిన వీడియోలను అతడి యూట్యూబ్ చానెల్‌లో పోస్ట్‌ చేశాడు. మరోవైపు అచ్చం కుక్కలా ఉన్న టోకో ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. వీటిని చూసి నెటిజన్లు ఆశ్చర్యంతో నోరెళ్ల బెడుతున్నారు. కొంత‌మందేమో వీడికేం పోయేకాలం అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement