Thursday, May 2, 2024

దుల్క‌ర్ స‌ల్మాన్ మూవీ సీతారామం-టిక్కెట్స్ ధ‌ర‌లు ఇవే

ప‌లు చిత్రాల‌కి ఈ మ‌ధ్య కాలంలో సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌ని తగ్గిస్తూ ప్రేక్ష‌కుల‌ని థియేట‌ర్ కి ర‌ప్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు చిత్ర మేక‌ర్స్. అదే బాట‌లో సీతా రామం చిత్ర మేక‌ర్స్ న‌డుస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన సినిమా టికెట్ల ధ‌ర‌ల‌ను అందుబాటులో ఉంచారు. కాగా ఈ చిత్రంలో హీరోగా మ‌ల‌యాళ స్టార్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టించ‌గా …బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ , ర‌ష్మిక మంద‌న్నా ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు.

సింగిల్ స్క్రీన్స్ థియేటర్లు : రూ.147 (ఏపీ), రూ.150 (టీఎస్‌) జీఎస్టీతో క‌లిపి మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్లు : రూ.177 (ఏపీ), రూ. 195 (టీఎస్‌) జీఎస్టీతో క‌లిపి ..తాజాగా నిర్ణ‌యించిన రెగ్యుల‌ర్ టికెట్స్ ధ‌ర‌లు, సినిమా కంటెంట్ థియేట‌ర్ల‌కు జ‌నాల‌ను తీసుకొస్తుందని ధీమాగా ఉన్నార‌ట మేక‌ర్స్‌. ఈ చిత్రంలో బ్రిగేడియ‌ర్ విష్ణు శ‌ర్మగా సుమంత్ అక్కినేని న‌టిస్తుండ‌గా..అత‌డి భార్య‌గా భూమిక చావ్లా న‌టిస్తోంది. పెళ్లి చూపులు డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్ బాలాజీ పాత్ర‌లో న‌టిస్తుండ‌గా, ర‌ష్మిక క‌శ్మీరీ యువ‌తి అఫ్రీన్ పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ప్ర‌కాశ్‌రాజ్ మ‌రో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌గా..వైజ‌యంతీ మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో స్వ‌ప్న సినిమాస్ బ్యాన‌ర్‌పై స్వ‌ప్న ద‌త్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement