Thursday, April 18, 2024

ద‌ళిత‌బంధు ఫ‌లితాలు అద్భుతం : మంత్రి కేటీఆర్

తెలంగాణ‌లోని ద‌ళితుల‌ను ఆర్థికంగా అభివృద్ధి చేయాల‌ని సంక‌ల్పంతో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన ద‌ళిత‌బంధు ప‌థ‌కంపై రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. సీఎం కేసీఆర్ ద‌ళితుల అభివృద్ధి కోసం అమ‌లు చేస్తున్న ద‌ళిత‌బంధు అద్భుత స‌త్ఫ‌లితాల‌ను ఇవ్వ‌డం మొద‌లు పెట్టింద‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు. సామాజిక‌, ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో అట్ట‌డుగున ఉన్న నిరుపేద‌ల‌ను అభ్యున్న‌తి వైపు తీసుకెళ్లడ‌మే తెలంగాణ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని కేటీఆర్ ఉద్ఘాటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement