Friday, May 3, 2024

అనారోగ్యంతో.. న‌టి ఉత్త‌రా బావోక‌ర్ క‌న్నుమూత‌

చాలా కాలంగా దీర్ఘకాల అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ప్రముఖ నటి .. థియేటర్ ఆర్టిస్ట్ ఉత్తరా బావోకర్ కన్నుమూశారు. 79 ఏళ్ల వయసులో మహారాష్ట్రలోని పూణె లో ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె పరిస్థితి విషమించడంతో మరణించారని ఆమె కుటుంబానికి సన్నిహితవర్గాలు తెలిపాయి. గత ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఉత్తరా బావోకర్.. మంగళవారం పరిస్థితి విషమించడంతో.. ట్రీట్మెంట్ తీసుకుంటూ.. హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు. కాగా ఆమె అంత్యక్రియలు నిర్వహించినట్లు.. బందువులు మీడియాకు తెలిపారు.స్ట్రాంగ్ విమెన్ అన్న పేరును సాధించారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD)లో.. స్టూడెంట్ గా.. నటనను అభ్యసించిన ఉత్తరా బావోకర్ అనేక నాటకాల్లో తన ప్రతిభ కనబరిచారు.

ముఖ్యంగా.. ముఖ్యమంత్రి నాటకంలో పద్మావతి పాత్ర, మేనా గుర్జారి నాటకంలో టైటిల్ రోల్ మేనా పాత్రతో పాటు షేక్స్ పియర్ రచించిన ఒథేల్లో నాటకంలో డెస్టెమోనా పాత్రలో ఆమె అద్భుతంగా నటించారు. సౌత్ లో ప్రముఖ రచయిత గిరీష్ కర్నాడ్ రచించిన తుగ్లక్‌ నాటకంలో తల్లి పాత్రలో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. వివిధ నాటకాల్లో ఆమె పాత్రలు జనాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. గోవింద్ నిహ్లానీ చిత్రం తమస్‌ తో వెండితెరపై పెలుగులోకి వచ్చింది ఉత్తరా బావోకర్ . సుమిత్రా భావే చలనచిత్రాలలో కూడా బావోకర్ నటించింది. బాలీవుడ్ స్టార్ ప్రోడ్యూసర్ సునీల్ సుక్తాంకర్ నిర్మాణంలోనే ఉత్తరా దాదాపు ఎనిమిది సినిమాల్లో పనిచేశారు. అంతే కాదు ఆయన నిర్మాణంలో వచ్చిన సినమాల్లో ఉత్తరా బావోకర్ బలమైన స్త్రీ పాత్రలను పోషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement