Wednesday, May 1, 2024

ధృవ సర్జా నటిస్తున్న మూవీ మార్టిన్..

ధృవ సర్జా నటిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌-టైనర్‌ ‘మార్టిన్‌’ ప్రేక్షకులను అలరించటానికి సిద్ధమయ్యారు. ఎ.పి.అర్జున్‌ దర్శకత్వంలో ఉదయ్‌ కె.మెహతా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా టీ-జర్‌ను బెంగుళూరులో విడుదల చేశారు. ఘనంగా జరిగిన వేడుకకు భారీ సంఖ్యలో అభిమానులు, స్టార్స్‌ హాజరయ్యారు.
టీ-జర్‌లోని యాక్షన్‌ ఎలిమెంట్స్‌, ధృవ్‌ సర్జా నటన, యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించిన తీరు, విజువల్స్‌కి ఆడియెన్స్‌ నుంచి స్పందన వస్తోంది. ఈవెంట్‌లో టీ-జర్‌తో పాటు- ఫస్ట్‌ లుక్‌ను కూడా విడుదల చేశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో చిత్ర యూనిట్‌ ప్రత్యేకంగా ముచ్చ టించింది. ‘అద్దూరి’ సినిమా తర్వాత ధృవ సర్జా, ఎ.పి.అర్జున్‌ కాంబి నేషన్‌లో ‘మార్టిన్‌’ సినిమా రూపొందింది. టీ-జర్‌ను చూసిన వారందరూ యాక్షన్‌ సన్నివేశాలు నెక్ట్స్‌ లెవల్‌లో ఉన్నాయని ప్రశంసిస్తున్నారు. రవి వర్మ, రామ్‌ లక్ష్మణ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లను అందించారు. అద్భుతమైన సంగీ తంలోనే కాదు.. బ్యాగ్రౌండ్‌ స్పెషలిస్ట్‌గా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపా దించుకున్న మణి శర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. సత్య హెగ్డే సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో మార్టిన్‌ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement