Tuesday, May 14, 2024

బైడెన్‌కు స‌ర్జ‌న్ జ‌న‌ర‌ల్‌గా వివేక్ మూర్తి

అమెరికాలో అత్యున్నత వైద్య పదవి అయిన సర్జన్ జనరల్ పదవికి భారత సంతతి వైద్యుడు డాక్టర్ వివేక్ మూర్తి ఎంపికయ్యారు. అమెరికా అధ్య‌క్షుడు జోసెఫ్ బైడెన్‌కు..వివేక్ మూర్తి స‌ర్జ‌న్ జ‌న‌ర‌ల్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. సేనేట్‌లో జ‌రిగిన ఓటింగ్‌లో వివేక్‌కు అనుకూలంగా 57 ఓట్లు వ‌చ్చాయి. రిప‌బ్లిక‌న్ పార్టీకి చెందిన ఏడు మంది సేనేట‌ర్లు డాక్ట‌ర్ మూర్తికి అనుకూలంగా ఓటేశారు. ఇక 2013లోనూ స‌ర్జ‌న్ జ‌న‌ర‌ల్‌గా వివేక్ ప‌నిచేశారు. బరాక్ ఒబామా హయాంలో డాక్టర్ వివేక్ మూర్తిని అమెరికా సర్జన్ జనరల్‌గా నియమించారు. 37 ఏళ్ల‌కే ఆ ప‌ద‌విని చేప‌ట్టిన వ్య‌క్తిగా రికార్డు క్రియేట్ చేశారు. కానీ ట్రంప్ పాల‌న స‌మ‌యంలో ఆ ప‌ద‌విని ఆయ‌న వీడారు. “అమెరికా సర్జన్ జనరల్‌గా మరోసారి పనిచేయడానికి సెనేట్ ధృవీకరించినందుకు నేను చాలా కృతజ్ఞుడను. గత సంవత్సరంలో మేము ఒక దేశంగా గొప్ప కష్టాలను భరించాము. అమెరికాలో కరోనా నుంచి విముక్తి కలిగించేందుకు అన్ని దేశాలతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను” అని వివేక్ మూర్తి ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement