Sunday, April 28, 2024

టిల్లుగాడి లొల్లి ఆహాలో.. రిలీజ్ డేట్ విడుద‌ల చేసిన మేక‌ర్స్

సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన రొమాంటిక్ యాక్ష‌న్ సినిమా డిజే టిల్లు. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌‌గా మంచి కిక్కిచ్చింది. చిన్న సినిమానే అయినా బాక్సాఫీస్ వద్ద పెద్ద హంగామా చేసింది ఈ సినిమా. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు విమల్‌ కృష్ణ దర్శకత్వం వహించారు..

అయితే ఈ సినిమా త్వ‌ర‌లో ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రానుంది.. ఈ సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్ రైట్స్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా సోంతం చేసుకుంది.. మార్చి 4వ తేదిన ఈ సినిమా ఓటీటీ లో రిటీజ్ చేస్తున్న‌ట్టు అధికారికంగా ప్రకటిస్తూ స్పెషల్‌ పోస్టర్ రిలీజ్ చేసింది అహా..లొల్లి మార్చి 4 నుంచి షురు చేద్దాం అంటూ తెలుగు ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
Advertisement

తాజా వార్తలు

Advertisement