Monday, May 6, 2024

యాపిల్‌ ఐఫోన్‌ 14పై డిస్కౌంట్‌.. వాలంటైన్‌ డే సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌

ప్రేమికుల దినోత్సవం సందర్బంగా యాపిల్‌ కంపెనీ తన లెటేస్ట్‌ ఐఫోన్‌ 14 సిరీస్‌ పై భారీ డిస్కౌంట్‌ ప్రకటించింది. వాలంటైన్స్‌ వీక్‌ సందర్బంగా ఐఫోన్‌ 14, ఐఫోన్‌ 14 ప్లస్‌, ఐఫోన్‌ 14 ప్రో, ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్‌ మోడళ్లపై యాపిల్‌ థర్డ్‌ పార్టీ అధీకృత రిటైల్‌ అమ్మకందారు ఐవీనస్‌ పరిమితకాలపు ఆఫర్‌ ప్రకటించింది. ఐఫోన్‌ 14 సిరీస్‌పై బ్యాంక్‌ ఆఫర్‌, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌, ఎక్స్ఛేంజ్‌ బోనస్‌ వంటివన్నీ కలుపుకుని గరిష్టంగా 42,000 రూపాయల వరకు డిస్కౌంట్‌ లభిస్తుందని తెలిపింది.

ఐఫోన్‌ 14 ధర 79,990 రూపాయలుగా ఉంది. ప్రస్తుత ఆఫర్ల అన్ని కలుపుకుంటే 37,900 రూపాయలకే లభిస్తుంది. ఇందులో ఐవీనస్‌ స్టోర్‌ 8 వేల వరకు డిస్కౌంట్‌ ఇస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కార్డులపై 4 వేల రూపాయలు క్యాష్‌ బ్యాక్‌ లభిస్తుంది. పాత ఐఫోన్‌, ఇతర పాత ఫోన్లు మార్చుకోవడం ద్వారా ఎక్స్ఛేంజ్‌ బోనస్‌ కలిపితే 30 వేల వరకు పొందవచ్చు. ఇలా అన్ని ఆఫర్లు కలుపుకుంటే ఇది 42 వేల రూపాయలు అవుతుంది.

ఐఫోన్‌ ప్లస్‌ ధర 89,990 రూపాయలుగా ఉంది. ఈ ఫోన్‌ అన్ని ఆఫర్లు కలిపితే 46,990 రూపాయలకు లభిస్తుంది. ఈ ఫోన్‌పై ఐవీఎస్‌ 9 వేలు డిస్కౌంట్‌ ఇస్తోంది. మిగిలిన ఆఫర్లు పై దానిలాగే ఉంటాయి. ఐఫోన్‌ 13 కూడా అన్ని ఆఫర్లు కలిపి 30,900 రూపాయలకే ఇస్తామని ఐవీఎస్‌ తెలిపింది. ఆన్‌లైన్‌ ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌ కూడా ఐఫోన్‌ 14 ప్లస్‌పై బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ తదితర బ్యాంక్‌ కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ అందిస్తోంది. పాత ఫోన్‌ మార్పిడిపై కూడా ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement