Wednesday, April 24, 2024

తిరిగి 5వ స్థానానికి మన స్టాక్‌ మార్కెట్లు

అదానీ షేర్ల దెబ్బకు భారీగా విలువ కోల్పోయిన స్టాక్‌ మార్కెట్‌ తిరిగి ఈ వారం 5వ స్థానానికి చేరింది. అదానీ షేర్ల పతనంతో మన స్టాక్‌ మార్కెట్లు ఒక స్థానికి దిగువకు దిగజారడంతో ప్రాన్స్‌ ఈ స్థానాన్ని ఆక్రమించింది. శుక్రవారం నాటికి స్టాక్‌ మార్కెట్‌ విలువ 3.15 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. ప్రాన్స్‌ను ఆరో స్థానికి నెట్టివేసిన భారత్‌ 5వ స్థానంలోకి వచ్చింది. 7వ స్థానంలో బ్రిటన్‌ మార్కెట్‌ ఉందని బ్లూమ్‌బర్గ్‌ విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. షేర్లలో రాబడి వృద్ధి ఆధారంగా మార్కెట్‌ విలువను లెక్కించారు. రెండు సంవత్సరాలుగా మన మార్కెట్లు మంచి పనితీరును కనబరుస్తున్నాయి.

జనవరి 24కు ముందు కంటే ప్రస్తుతం స్టాక్‌ మార్కెట్‌ విలువ 6 శాతం తక్కువగా ఉంది. హిండెన్‌ బర్గ్‌ నివేదికతో జనవరి 24 తరువాత అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ భారీగా పతనమయ్యాయి. దీంతో మార్కెట్‌ విలువ తగ్గింది. ఈ నివేదిక తరువాత అదానీ గ్రూప్‌ షేర్లు 120 బిలియన్‌ డాలర్ల మేర నష్టపోయాయి. ఫిబ్రవరి 9 నాటికి విదేశీ ఇన్వెస్టర్లు మొత్తం 7 సెషన్స్‌లో భారీగా అమ్మకాలు జరిపారు. బడ్జెట్‌లో మౌళికసదుపాయలపై ఖర్చు పెంచుతున్నట్లు ప్రకటించడంతో విదేశీ ఇన్వెస్టర్లు మళ్లి కొనుగోళ్లు జరపడం ప్రారంభించారు.

ప్రస్తుతం మన స్టాక్‌ మార్కెట్‌లో ఒక షేరుకు వచ్చే రాబడి 14.5 శాతంగా ఉంది. ఇది చైనా మార్కెట్లకు దగ్గరగా ఉంది. చాలా అభివృద్ధి చెందిన మార్కెట్ల కంటే రాబడి శాతం మెరుగ్గా ఉందని బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది. అమెరికా స్టాక్‌ మార్కెట్‌లో ఒక షేరు పై రాబడి 0.8 శాతంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement