Thursday, May 2, 2024

మామిడి ప్రియులకు నిరాశ, గతేడాదికంటే అధికంగా మామిడిపళ్ల ధర

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: వేసవి అంటే… మండే ఎండలతోపాటు మధురమైన మామిడిపళ్లు రుచి చూసే కాలం. మండే ఎండల్లోనూ మధురమైన రుచితో కడుపునింపుకునే మామిడి ప్రియులకు ఈ సారి నిరాశే ఎదురవుతోంది. ప్రస్తుతం మార్కెట్‌లో నాణ్యమైన కిలో మామిడి పండల్‌ ధర రూ.120 నుంచి రూ.150 దాకా పలుకుతోంది. పైగా ప్రతి ఏటా ఇప్పటికే మార్కెట్‌కు రావాల్సిన మామిడి దిగుబడి ఆలస్యమవుతోంది. మరోవైపు ఈ ఏడాది మామిడి దిగుమతులు గణనీయంగా తగ్గిపోయాయి.

దీంతో మామిడి పళ్ల ప్రియులకు నిరాశ తప్పే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రతి ఏటా మే రెండో వారం నుంచే మార్కెట్లన్నీ మామిడి పళ్లతో నిండిపోతాయి. కాని ఈ ఏడాది మే గడిచి జూన్‌ సమీపిస్తున్న అక్కడక్కడా అరకొర మాత్రమే మామిడి పళ్లు మార్కెట్‌లో దర్శనమిస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement