Tuesday, April 30, 2024

ధూమ‌మ్ ట్రైల‌ర్ రిల‌జ్ కి డేట్ ఫిక్స్.. ప్ర‌క‌టించిన మేక‌ర్స్

ప్రముఖ నటుడు ఫహద్ ఫాసిల్ టాలీవుడ్‌లో అల్లు అర్జున్ పుష్ప మూవీ తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచయం అయ్యాడు.. ఇక పుష్ప 2: ది రూల్‌లో మ‌రో సారి కనిపించనున్నాడు. అయితే, దాంతో పాటు U-టర్న్ ఫేమ్ పవన్ కుమార్ దర్శకత్వం తెర‌కెక్కించిన అప్ క‌మింగ్ పాన్-ఇండియన్ మూవీ ధూమమ్‌లో నటించాడు ఫహద్.

కాగా, ఈ థ్రిల్లర్ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను రేపు (జూన్ 8న) మధ్యాహ్నం 12:59 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేక‌ర్స్. సినిమాపై అంచనాలు కూడా చాలా ఎక్కువగానే క‌నిపిస్తున్నాయి.. దీంతో అభిమానులు ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement