Saturday, May 4, 2024

ధోనీ LGM మూవీ – ట్రైలర్ రిలీజ్

YouTube video

స్టార్ క్రికెటర్ గా ఎంతో పేరు తెచ‍్చుకున్న మహేంద‍్ర సింగ్. ధోనీ తమిళంలో నిర్మాతగా తొలి సినిమా తీస్తున్నాడు. ‘LGM’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్ర ట్రైలర్‌ని తాజాగా రిలీజ్ చేశారు.ధోనీ ఎంటర్ టైన్‌మెంట్స్ నిర్మాణ సంస్థ స్థాపించిన తర్వాత ‘LGM’ (లెట్స్ గెట్ మ్యారీడే) పేరుతో తీస్తున్న ఈ మూవీలో హరీశ్ కల్యాణ్, ఇవానా, నదియా ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. పెళ్లి-ఫ్యామిలీ ఎమోషన్స్ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు .

గౌతమ్(హరీశ్ కల్యాణ్), మీరా(ఇవానా) రెండేళ్లుగా లవ్‌లో ఉంటారు. పెద్దల అంగీకారంతో పెళ్లికి రెడీ అవుతారు. అయితే అత్తతో కలిసి ఉండటానికి మీరా నో చెబుతుంది. దీంతో గౌతమ్.. మన వివాహం కుదరదని అంటాడు. దీంతో రాజీకొచ్చిన మీరా.. అత్త(నదియా)ని అర్థం చేసుకోవడం కోసం తన పెళ్లికి ముందు ఆమెతో కలిసి ట్రిప్ ప్లాన్ చేస్తుంది. అయితే ఈ క్రమంలో మీరాతో పాటు ఆమెకు కాబోయే అత్తని కొందరు కిడ్నాప్ చేస్తారు. చివరకు ఏమైంది? అనేది స్టోరీ

.

Advertisement

తాజా వార్తలు

Advertisement