Sunday, April 28, 2024

స్పైస్ జెట్‌పై డీజీసీఏ ఆంక్షలు.. 8 వారాల పాటు 50 శాతం సర్వీస్‌లే

వరకు 8 సార్లు స్పెస్‌జెట్‌ విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో డీజీసీఏ సోకాజ్‌ నోటీస్‌ జారీ చేసింది. వేసవిలో
ఆమోదం పొందిన సర్వీసుల్లో 8 వారాల పాటు 50 శాతం మాత్రమే ఆపరేట్‌ చేయాలని స్పెస్‌జెట్‌ను డీజీసీఏ ఆదేశించింది. దీనిపై స్పందించిన సంస్థ ఈ ఆంక్షల వల్ల విమాన సర్వీస్‌లపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చెసింది. ఇప్పటికే విమానయాన సంస్థలు తమ సర్వీస్‌లను రీషెడ్యూల్‌ చేసినందున ఈ ఆంక్షల వల్ల తమ సర్వీస్‌లను రద్దు చేసుకోవాల్సిన అవసరం ఉండదని స్పెస్‌జెట్‌ వివరించింది. వేసవిలో అనుమతి పొందిన సర్వీస్‌లను ఇప్పటికే రీషెడ్యూల్‌ చేసినందున ఈ ఆదేశాలతో సర్వీస్‌లను తగ్గించాల్సిన అవసరంలేదని తెలిపింది.

డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) మార్గదర్శకాల ప్రకారం పని చేస్తామని స్పెస్‌జెట్‌ తెలిపింది. జూన్‌ 19 నుంచి 8 సార్లు స్పెస్‌జెట్‌ విమనాల్లో ఏర్పడిన సాంకేతిక సమస్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా డీజీసీఏ జులై 6న స్పెస్‌జెట్‌కు షోకాజ్‌ నోటీస్‌ జారీ చేసింది. దీనిపై స్పెస్‌జెట్‌ వివరణ ఇచ్చిన తరువాత డీజీసీఏ బుధవారం నాడు సర్వీస్‌లను 50 శాతానికి తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. భద్రత, నమ్మదగిన విమాన సర్వీస్‌లు అందించాల్సిన అవసరం ఉందని డీజీసీఏ తన ఆదేశాల్లో పేర్కొంది. స్పెస్‌జెట్‌లో భద్రతాపరమైన లోపాలను ఎత్తి చూపింది. ఆంక్షలు విధించిన 8 వారాల పాటు స్పెస్‌జెట్‌పై పూర్తి నిఘా ఉంటుందని డీజీసీఏ స్పష్టం చేసింది. దీనిపై తదుపరి ఏం చేయాలన్నది 8 వారాల తరువాత నిర్ణయిస్తామని స్పష్టం చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement