Sunday, April 28, 2024

Ramlalla: అయోధ్యలో వెల్లవెత్తిన భక్తజనం…తొలిరోజే 5లక్షమందికి దర్శన భాగ్యం

అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. సోమవారం బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరుగగా, మంగళవారం నుంచి సామాన్య భక్తులకు రామయ్య దర్శనభాగ్యం కల్పించారు. వేకువజామునే ఆలయం వద్దకు లక్షలాది మంది తరలివచ్చారు. ప్రధాన మార్గమైన ‘రామ్‌పథ్‌’ వీధులన్నీ కిక్కిరిసిపోయాయి.బాలరాముడి ప్రాణప్రతిష్ట జరిగిన మరుసటి రోజే అయోధ్యకు భారీగా భక్తులు పోటెత్తారు. అయితే మంగళవారం నాడు 5ల‌క్షల మంది భ‌క్తులు రాంల‌ల్లాను ద‌ర్శించుకున్నారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం అయోధ్యలో రామమందిర ఏర్పాట్లను పరిశీలించారు. హెలికాఫ్టర్‌లో రామమందిరం ప్రాంతంలో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. కాగా.. రెండు దఫాలుగా భక్తులను అనుమతిస్తుండగా.. వారిని నియంత్రించడం పోలీసులకు సవాల్ గా మారింది. భక్తుల రద్దీ నేపథ్యంలో 8 వేల మంది పోలీసులను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

- Advertisement -

డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ (హోం) సంజయ్ ప్రసాద్ స్వయంగా ఆలయంలోనే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇదిలా ఉంటే.. అయోధ్యకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్న క్రమంలో రోడ్లన్నీ నిండిపోయాయి. దీంతో 30 కి.మీ దూరాన వాహనాలను ఆపేస్తున్నారు. అక్కడి నుంచి కాలినడకన అయోధ్య రామ మందిరానికి చేరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement