Sunday, April 28, 2024

హైదరాబాద్ ఇళ్లకు డిమాండ్‌! జూన్‌లో పెరిగిన ధరలు.. 77 శాతం వృద్ధి..

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ మహానగరంలో ఇళ్ల ధరలు 12 శాతం వరకు పెరిగాయని స్థిరాస్తి సేవల సంస్థ ప్రాప్‌ ఈక్విటీ తెలిపింది. నివాస గృహాలకు నగరంలో గత సంత్సరం కంటే ఈ త్రైమాసికంలో డిమాండ్‌ బాగా పెరిగిందని వెల్లడించింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో చదరపు అడుగు ధర 5,760 రూపాయాలు ఉంటే, ప్రస్తుతం 6,472 రూపాయలకు పెరిగిందని తెలిపింది. ఇళ్ల అమ్మకాల్లోనూ 77 శాతం వృద్ధి నమోదైంది. గత సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో 8,176 ఇళ్లు, ప్లాట్లు అమ్ముడు పోయాయి. ఈ సంవత్సరం ఇదే కాలంలో 14,457 అమ్మడుపోయాయి.

దేశవ్యాప్తంగా పెరిగిన ధరలు..

హైదరాబాద్‌తో పాటు, దేశంలోని ప్రముఖ నగరాల్లో ఇళ్ల ధరలు 15 శాతం వరకు పెరిగాయి. చెన్నయ్‌లో ధరలు 15 శాతం పెరిగాయి. ఇక్కడ చదరపు అడుగు ధర 5,855 నుంచి 6,744 రూపాయలకు పెరగింది. గురుగామ్‌లో చదరపు అడుగు ధర 10,315 రూపాయల నుంచి 12 శాతం పెరిగి 11,517కు చేరాయి. నోయిఆలో 9 శాతం వృద్ధి చెందాయి. బెంగళూర్‌లో ధరలు 8 శాతం పెరిగాయి. ఇక్కడ చదరపు అడుగు 5,760 నుంచి 6,196 రూపాయలుకు పెరిగింది. ముంబాయి, థానే, పూణేల్లో 3 శాతం చొప్పున ధరలు పెరిగాయని తెలిపింది. గత సంవత్సరంతో పోల్చితే 9 నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 96 శాతం పెరిగాయి. మొత్తం 93,158 ఇళ్లు, ప్లాట్లు అమ్ముడుపోయాయి. గత సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంతో పోల్చితే 7 శాతం అమ్మకాలు తగ్గాయి. ఏప్రిల్‌-జూన్‌ మధ్య కొత్తగా 69,813 యూనిట్ల నిర్మాణం ప్రారంభమైంది. గత సంవ త్సరంతో పోల్చితే ఇది 51 శాతం ఎక్కువ. గత సంవత్సరం మార్చి త్రైమాసికంతో పోల్చితే 24 శాతం తక్కువ. 9 నగరాల్లో అమ్ముడుపోని ఇళ్లు, ప్లాట్ల సంఖ్య 4,05,586 ఉన్నట్లు నివేదికలో తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement