Friday, May 17, 2024

Delhi | చంద్రబాబు బెయిల్ పిటిషన్ వాయిదా..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో అక్రమాల వ్యవహారంలో నమోదైన కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణ వాయిదా పడింది. కౌంటర్ దాఖలుకు సమయం కావాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు శుక్రవారం సుప్రీంకోర్టును కోరారు.

స్కిల్ కేసులో సెక్షన్ 17 (ఏ)పై ఇటీవలే తీర్పు వెలువడిన నేపథ్యంలో కౌంటర్‌కు సమయం కావాలని న్యాయవాదులు గుంటూరు ప్రేరణ, గుంటూరు ప్రమోద్ కుమార్‌లు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని బెంచ్‌ను కోరారు. దీంతో ధర్మాసనం ఫిబ్రవరి 12వ తేదీకి విచారణను వాయిదా వేసింది. అప్పటిలోగా ఇరు పక్షాలూ తమ వాదనలను లిఖితపూర్వకంగా సమర్పించాలని సూచించింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో హైకోర్టు చంద్రబాబుకు గతంలో బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement