Tuesday, May 14, 2024

Deepika Padukone: అరుదైన గౌర‌వం.. బాఫ్టా అవార్డుల ప్ర‌జెంట‌ర్ గా అవ‌కాశం ..

బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. బ్రిటిష్‌ అకాడమీ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆమె ప్రజెంటర్‌గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏకైక భారతీయ నటి ఆమె కావడం విశేషం.

లండన్‌లోని రాయల్‌ ఫెస్టివల్‌ హాల్‌లో బ్రిటిష్‌ అకాడమీ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్ అవార్డుల ప్రదానోత్సవం గ‌త రాత్రి అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో దీపిక భారతీయత ఉట్టిపడేలా సబ్యసాచి చీరలో వేదికపై మెరిసిపోయారు. ‘బెస్ట్‌ ఫిల్మ్‌ నాట్‌ ఇన్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌’ కేటగిరీలో ఆమె అవార్డును ప్రదానం చేశారు. ఇందుకు సంబంధించిన పొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘ఇండియన్‌ క్వీన్‌’ అంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement