Thursday, May 2, 2024

వాహన టోకు విక్రయాల్లో క్షీణత : సియామ్‌

దేశవ్యాప్తంగా గతనెలలో హోల్‌సేల్‌ వాహన విక్రయాలు గణనీయం గా తగ్గిందని వాహన పరిశ్రమ సమాఖ్య సియామ్‌ శుక్రవారం వెల్లడించిం ది. సెమీ కండక్టర్లు కొరత తీవ్ర ప్రభావం చూపిందని దీంతో డీలర్లకు వాహన డెలివరీలు తగ్గాయని సియామ్‌ పేర్కొంది. గత నెల డీలర్లుకు సరఫరా చేసిన వాహ నా లు 2021 ఫిబ్రవరితో పోలిస్తే 17,35,909 వాహనాల్లో 23శాతం తగ్గి 13,28, 027కు పరిమితమైంది. అదేవిధంగా ప్రయాణికుల వాహనాల టోకు విక్రయాలు 2,81,380 నుంచి 6శాతం తగ్గి 2,62,984మేరకు తగ్గాయని తెలిపింది.

వీటిలో కార్ల విక్రయాలు 1,55,128 యూనిట్లు నుంచి 1,33,572 యూనిట్లుకు తగ్గినట్లు సియామ్‌ నివేదించింది. వ్యక్తిగత వినియోగ వాహనాల సరఫరా 1,20,122 నుంచి 1,14,350యూనిట్లుకు తగ్గింది. కాగా ద్విచక్ర వాహనాల విషయా నికివస్తే డీలర్లుకు గత నవంబర్‌లో 10,37,994 ద్విచక్రవాహనాలు, 3,44,137 స్కూటర్లును ఆయా కంపెనీలు సరఫరా చేశాయని సియామ్‌ వెల్లడించింది. త్రిచక్ర వాహనా లుకొస్తే 2021 ఫిబ్రవరితో పోలిస్తే 27,656 నుంచి స్వల్పంగా తగ్గి 27,039కి చేరింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement