Thursday, May 2, 2024

Delhi: ఏలూరు కోర్టులోనే తేల్చుకోండి, హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేం.. అగ్రిగోల్డ్ బాధితుల పిటిషన్‌పై సుప్రీం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: అగ్రిగోల్డ్ డిపాజిటర్ల వ్యవహారాన్ని ఏలూరు కోర్టులోనే తేల్చుకోవాలని అగ్రిగోల్డ్ బాధితులకు సుప్రీంకోర్టు సూచించింది. తెలంగాణ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాన్షు ధులియాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదులు నష్టపోయిన డిపాజిటర్లు 32 లక్షల మంది ఉన్నారని తెలిపారు.

ఈ మొత్తం కుంభకోణం విలువ రూ.6,640 కోట్లు అని వెల్లడించారు. హైకోర్టు కొన్ని ఆస్తులు వేలం వేసి రూ.50 కోట్లు రాబట్టిందని, తదుపరి కేసును ఏలూరు ప్రత్యేక కోర్టుకు బదిలీ చేసిందని వివరించారు. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును డిపాజిటర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. డిపాజిటర్లను ఏలూరు కోర్టుకే వెళ్లాల్సిందిగా సూచించింది. ఈమేరకు డిపాజిటర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement