Saturday, December 7, 2024

Delhi : కేంద్రానికి డెడ్‌లైన్…. నేడు చ‌లో ఢిల్లీకి రైత‌లు పిలుపు…

కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలతో నాలుగు దఫాలుగా జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో నేడు చలో ఢిల్లీకి రైతులు పిలుపు నిచ్చారు. రైతులు ఢిల్లీలోకి చొరబడకుండా భారీ ఎత్తున పోలీసు బలగాలు మొహరించాయి. ఎక్కడికక్కడ ఢిల్లీ సరిహద్దుల్లో బ్యారికేడ్లను, సిమెంట్ దిమ్మెలను ఏర్పాటు చేసి పహారా కాస్తున్నాయి.

మరోవైపు ఉత్తర్‌‌ప్రదేశ్, హర్యానా, పంజాబ్ నుంచి వస్తున్న రైతులు ప్రస్తుతం శంభు సరిహద్దుల్లో ఉన్నారు. వారంతా ట్రాక్టర్లు, కాలినడకన బయలుదేరారు. ఈరోజు ఉదయం 11 గంటలలోపు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర డిమాండ్‌పై స్పందించాలని రైతులు అల్టిమేటం ఇచ్చారు. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత వరకూ ఎలాంటి స్పదన రాలేదు. దీంతో రైతులు ఏ క్షణమైనా ఢిల్లీ వైపునకు దూసుకు వచ్చే అవకాశముందని అంచనా వేసిన ప్రభుత్వం భారీ ఎత్తున పోలీసు బలగాలను మొహరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement