Thursday, December 9, 2021

మొబైల్స్ దసరా ఆఫర్లు .. క్యాష్ బ్యాక్ ఎంతంటే..

హైదరాబాద్‌‌‌‌, ఆంధ్ర‌ప్ర‌భ‌: ద‌స‌రా పండుగ‌కు చాలా కంపెనీలు ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తున్నాయి. బిగ్ సీ వంటి మొబైల్ ఫోన్ల అమ్మ‌కం చేసే కంపెనీ అయితే పెద్ద మొత్తంలో ఆఫ‌ర్లు ఇస్తున్న‌ట్టు తెలిపింది. బజాజ్‌‌‌‌ ఫైనాన్స్ ద్వారా ఫోన్ కొన్న‌ట్ట‌యితే రూ.3,500 దాకా క్యాష్‌‌‌‌బ్యాక్ ఇస్తున్న‌ట్టు తెలిపింది. అదే ఐసీఐసీఐ కార్డుల‌ ద్వారా కొంటే రూ.1,500 వరకు.. అమెజాన్‌‌‌‌ పేతో మొబైల్‌‌‌‌ కొంటే రూ.3,500 వరకు క్యాష్‌‌‌‌బ్యాక్ రానుంది. పేటీఎం మాల్‌‌‌‌తో ఒప్పో మొబైల్స్‌‌‌‌ కొంటే 15 శాతం వరకు క్యాష్‌‌‌‌బ్యాక్ పొందవచ్చు. శామ్‌‌‌‌సంగ్‌‌‌‌ మొబైల్స్‌‌‌‌ 10 వేల వరకు, వన్‌‌‌‌ప్లస్‌‌‌‌ మొబైల్స్‌‌‌‌పై రూ.7వేల వరకు, ఎంఐ మొబైల్స్‌‌‌‌పై రూ.3 వేల వరకు, వివో మొబైల్స్‌‌‌‌పై 10 శాతం వరకు, ఒప్పో మొబైల్స్‌‌‌‌పై రూ.4 వేల వరకు క్యాష్‌‌‌‌బ్యాక్‌‌‌‌ పొందవచ్చు. స్మార్ట్‌‌‌‌టీవీలపై రూ.4,500 వరకు క్యాష్‌‌‌‌బ్యాక్‌‌‌‌ అందుకోవచ్చు. ఈఎంఐ ఆప్షన్‌‌‌‌ కూడా ఉందని బిగ్‌‌‌‌ సీ ఫౌండర్‌‌‌‌, సీఎండీ బాలు చౌదరి చెప్పారు. కస్టమర్లు ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని బిగ్‌‌‌‌సీ బ్రాండ్‌‌‌‌ అంబాసిడర్‌‌‌‌ సూపర్‌‌‌‌స్టార్‌‌‌‌ మహేశ్‌‌‌‌ బాబు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News