Saturday, April 27, 2024

ట్విట్ట‌ర్ ట్వీట్లపై “డైలీ వ్యూ లిమిట్”.. మ‌రో కొత్త ఫీచ‌ర్ యాడ్ చేసిన మ‌స్క్

ప్రుముఖ సోష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ లో విపరీతమైన డేటా స్క్రాపింగ్ , సిస్టమ్ మానిప్యులేషన్ పెరిగి పోయింద‌ని.. ఆ స‌మ‌స్య‌ను పరిష్కరించే ప్రయత్నంలో సోషల్ మీడియా సంస్థ వినియోగదారులు రోజువారీగా చదవగలిగే ట్వీట్ల సంఖ్యపై “తాత్కాలిక” పరిమితిని విధించిన‌ట్లు సంస్థ అధినేత ఎలోన్ మస్క్ తెలిపారు.

ట్విట్ట‌ర్ లో ఈ ప‌రిమాతుల‌ను మూడు ర‌కాలుగా క్ల‌సిఫై చేశారు. Twitter లో బ్లూ టిక్ కోసం సబ్‌స్క్రైబ్ చేసుకున్న వారు రోజుకు 6,000 పోస్ట్‌లను చూద‌గ‌ల‌రు. అదే విధంగా బ్లూ టిక్ కోసం సబ్‌స్క్రైబ్ చేసుకోని వ్యక్తులు రోజుకు 600 పోస్ట్‌లను చదవడానికి పరిమితం చేయబడ్డారు. అల‌గే, కొత్తగా (రీసెంట్ గా) సబ్‌స్క్రైబ్ చేసుకున్న వారు రోజుకు 300 ట్వీట్లను చదవడానికి పరిమితం చేయబడినట్టు మస్క్ ఒక ట్వీట్‌లో తెలిపారు.

- Advertisement -

కాగా, ట్విట్ట‌ర్ లో వినియోగ‌దారుల నుంచి వ‌స్తున్న కంప్లేయింట్స్ మేరకు ఈ పరిమితులు వెరిఫై చేయబడిన యూజర్‌లకు రోజుకు 8,000 పోస్ట్‌లకు., వెరిఫై అవ్వ‌ని వినియోగదారులకు రోజుకు 800, కొత్త వినియోగదారులకు 400 పోస్ట్‌లకు త్వరలోనే పెంచ‌నున్న‌ట్టు తదుపరి ట్వీట్‌లో మస్క్ వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement